
Ap 10th class results release date 2025 ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం, ఇప్పటికే ఇంటర్మీడియట్ కు సంబంధించి పలితాలు విడుదలయ్యాయి . ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. పదవ తరగతి ఫలితాల కోసం ఆరు లక్షల 50 వేల మంది విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల విడుదలపై అటు విద్యార్థుల్లోనూ తల్లిదండ్రులను తీవ్రమైన ఉత్కంఠ గా ఉంది ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి పరిషత్ ఫలితాలు చాలా కీలకంగా మారలున్నాయి. గత నెల అనగా మార్చి 17వ తారీకు నుంచి ఏప్రిల్ 1 తారీకు వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్ష లు జరిగాయి. పరీక్షలు ముగిసిన వెంటనే రెండు రోజులకే అంటే ఏప్రిల్ మూడో తారీకు నుంచి తొమ్మిదో తారీఖు వరకు పేపర్ కరెక్షన్స్ చేయడం జరిగింది. పేపర్ కరెక్షన్స్ 7 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. 2024-2025 అకాడమిక్ ఇయర్ గాను ఆరు లక్షల 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్రమైన కంఠత ఉంది వీటన్నిటికీ తరలించుతూ ఏప్రిల్ 12వ తారీకు నుండి మార్కుల ఎంట్రీ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది మార్కులు ఎంట్రీ తప్పియా ఏప్రిల్ 16వ తారీకు లోపు ముగిసే అవకాశం ఉంది, ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎలాంటి సాంకేతిక సమస్యలకు తావు లేకుండా విద్యాశాఖ మంత్రితో మరియు విద్యాధికారులతో సంప్రదించి ఏప్రిల్ 22వ తారీకు పరీక్ష ఫలితాలు విడుదల చేయుటకు రంగం సిద్ధం చేయడం జరిగింది
Ap 10th class results release date 2025

పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం ఎలా ?
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తారీకు దాదాపుగా విడుదల అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముందుగా ఈ పరీక్ష ఫలితాలు తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ పదో తరగతి బోర్డు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లేదా www.xyzbrain.in క్రోమ్బ్రౌజర్ లో ఓపెన్ చేసి రిజల్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే రిజల్ట్ కి సంబంధించి లింక్ మీకు డిస్ప్లేలో ప్రత్యక్షమవుతుంది రిజల్ట్ పై క్లిక్ చేసి, విద్యార్థి రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థి అని పరిశీలించి, విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ చేసినట్లయితే విద్యార్థి యొక్క ఫలితాలు చూపించబడతాయి. ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Follow us on youtube
Read this article : Ap inter 1st year supplementary question paper 2024
