AP SSC Result 2025 release date: ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల 2025 విడుదల తేదీ ఇదే? ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల కోసం లక్షలాదిమంది విద్యార్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కలలతో వేచి చూస్తున్నారు .ఈ ఫలితాలు విద్యార్థులకు చాలా కీలకం. ప్రతి విద్యార్థి దశలో పదవ తరగతి అనేది వారి జీవితానికి ఒక మలుపు లాంటిది, అందుకే ప్రతి ఒక్క విద్యార్థి వారి తల్లిదండ్రులు పదో తరగతి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి 17 తారీకు నుంచి ఏప్రిల్ ఒకటో తారీకు వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరిగింది, తగిన సిబ్బందితో పరీక్షలు విజయవంతంగా అయితే నిర్వహించారు .పరీక్షలు ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ మూడో తారీకు నుంచి తొమ్మిదో తారీఖు వరకు, అనగా ఏడు రోజుల వ్యవధిలోని లక్షలాది విద్యార్థుల పేపర్లు మూల్యాంకనం చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అన్న కోణంలో కొంత భయం, కొంత ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే పరీక్ష ఫలితాలు త్వరగా వస్తాయన్న ఆనందంలో విద్యార్థులు వారి జీవితంలో మరో అడుగు ముందుకు రాబోతుందన్న ఆనందంలో విద్యార్థి తల్లిదండ్రులు తప్పకుండా ఉంటారు. పదో తరగతి పేపర్ మూల్యాంకనం ఏప్రిల్ మూడో తారీకు నుంచి తొమ్మిదో తారీఖు వరకు విజయవంతంగా తగిన సిబ్బందిని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు .ఇందులో భాగంగా విద్యార్థుల పేపర్ కరెక్షన్లకు సంబంధించి తగినన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే పూర్ విద్యార్థులు ఉంటారో అలాంటి పేపర్లని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి కరెక్షన్ ని చేయమని సూచించినట్టుగా సమాచారం. పాస్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉన్న అలాంటి విద్యార్థులను తప్పకుండా పాస్ అయ్యేలాగా అయితే సూచనలు చేయడం జరిగింది.అనగా బోర్డర్ మార్కులకు వచ్చిన విద్యార్థులను అలాంటి వారి పేపర్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి వారు పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా వారిని పాస్ అయ్యేలాగా సూచనలు చేయడం జరిగినట్టుగా సమాచారం. ఏప్రిల్ 9వ తారీకు విద్యార్థుల సమాధానాల పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఈ ప్రక్రియ చాలా విజయవంతంగా చేయడానికి తగిన సిబ్బంది సహకారంతో సాధ్యమైనట్టుగా డీఈవో మరియు ఇతర అధ్యాపకులు తెలియజేశారు. తదుపరి చర్యలో భాగంగా విద్యార్థుల మార్కులను ఆన్లైన్ లో ఎంట్రీ చేయడానికి తక్కువ సమయం లోనే పూర్తి అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పదో తారీకు నుంచి ఏప్రిల్ 15వ తారీకు లోపు విద్యార్థుల మార్కుల ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియ మరియు సాంకేతిక అంశాలు అన్నింటిని విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు . విద్యార్థుల మార్కుల ఆన్లైన్ ఎంట్రీ మరియు సాంకేతిక సంబంధిత ప్రక్రియలు ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరలోనే అనగా ఏప్రిల్ 21,22,23 ఈ తారీకులలో ఏపీ పదవ తరగతి సంబంధించి పరీక్షా ఫలితాలను మన విద్యాశాఖ మంత్రి గారు మిగిలిన మంత్రుల సమక్షంలో ఒక అధికారిక సమావేశం నిర్వహించి పదవ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలను విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు పదవ తరగతి పరీక్ష ఫలితాల కంటే ముందు ఇంటర్మీడియట్ వారి పరీక్ష ఫలితాలు విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం.
AP SSC Result 2025 release date: ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల 2025 విడుదల తేదీ ఇదే?

AP SSC Result 2025 release date: ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల 2025 విడుదల తేదీ ఇదే? పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి ?
ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు అందరికంటే ముందుగా తెలుసుకో అనుకునేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ఈ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు బాక్స్ పై క్లిక్ చేసినట్లయితే అక్కడ పదవ తరగతి పరీక్ష ఫలితాలు సంబంధించి ఒక లింక్ అన్నది ఓపెన్ అయి ఉంటుంది అక్కడ విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ పరీక్ష ఫలితాలు డిస్ప్లే చేయబడతాయి

follow us on youtube
And read this article also APRJC preparation tips 2025, Aprjc syllabus, exam pattern 2025 complete details
1 thought on “AP SSC Result 2025 release date: ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల 2025 విడుదల తేదీ ఇదే?”